శా. అమ్మా! మన్ను తినంగ

 

శా. అమ్మా మన్ను తినంగ నే శిశువునో

మ్మా మన్ను తినంగ నే శిశువునో ?యాకొంటినో ?వెర్రినో ?
మ్మంజూడకు వీరి మాటలు మదిన్; న్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ ప్పైన దండింపవే

1.     అమ్మా 

2.    మన్ను తినంగ నే శిశువునో ?

3.    యాకొంటినో? వెర్రినో?

4.    నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; 

5.    న్నీవు కొట్టంగ 

6.    వీరిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు

7.     కాదేనిన్ 

8.    మదీయాస్య 

9.    గంధమ్మాఘ్రాణము జేసి 

10. నా వచనముల్ ప్పైన దండింపవే

అర్ధాలు:

తినంగ తినేందుకు ; నే శిశువునో నేను పసివాడినా?; యాకొంటినో = ఆకలితో ఉన్నానా?; వెర్రినో =పిచ్చివాడినా?; నమ్మంజూడకు = నమ్మ వద్దు ; మదిన్ = మనస్సులో; నన్నీవు = నన్ను నీవుకొట్టంగ =కొట్టాలని, దండించాలని ; వీరిమ్మార్గమ్ము = వీరు + ఇ + మార్గమ్ము వీళ్లందరూ ఈ విధంగా; చెప్పెదరు చెప్తున్నారుకాదేనిన్ = కాదంటే, అలా కాకపోతే ; మదీయాస్య = నా నోరు యొక్క; గంధమ్మాఘ్రాణము =గంధము + ఆఘ్రాణము = వాసన పీల్చి; జేసి = చూసి; వచనముల్ = మాటలు ; తప్పైన తప్పు ఐన =తప్పు అయినట్లతేదండింపవే = దండించు, శిక్షించు ;

భావం:

పోతన వ్రాసిన భాగవతంలోని, దశమ స్కంధంలోని పద్యము. శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడు. బలరాముడు వెళ్లి యశోదకు చెప్పాడు. యశోద వచ్చి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇది.

 

అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా పసివాడినాఆకలితో ఉన్నానా? పిచ్చివాడినా? నువ్వు వీళ్ల మాటలు నమ్మకు. నీ చేత నన్ను కొట్టించాలని ఇలా చెప్తున్నారు. నువ్వు, నా మాట నమ్మకపోతే నా నోటి వాసన చూడు. నా మాటలు తపైతే నన్ను దండించు.

Comments