శా. సింగంబాకటితో - 100 పద్యాలు
శా. సింగంబాకటితో | |
సింగం బాకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా | |
1. సింగం బాకటితో 2. గుహాంతరమునం జేడ్పాటుమై నుండి 3. మాతంగస్ఫూర్జిత యూథ దర్శన 4. సముద్యత్క్రోధమై వచ్చు నోజం | 5. కాంతార నివాసఖిన్నమతిన్ 6. అస్మత్సేనపై వీడె వచ్చెం 7. కుంతీసుత మథ్యముండు 8. సమరస్థేమాభి రామాకృతిన్ |
అర్ధాలు: సింగం బాకటితో = సింగంబు ఆకటితో = సింహము ఆకలితో; గుహాంతరమునం = గుహ + అంతరమునం =గుహ లోపలనుండి; చేడ్పాటుమై = బాధ తో; నుండి = ఉన్నదై; మాతంగ = ఏనుగుల; స్ఫూర్జిత = పిడుగులు పడుతున్నట్టుగా (thundering); యూథ = గుంపు; దర్శన = కనపించగానే; సముద్యత్క్రోధమై = సముద్యత్ + క్రోథమై = చాలా కోపంతో; వచ్చు= వస్తుంది; ఓజం = వెలుగుతో; కాంతార = అడవి; నివాస = ఉన్నటువంటి;ఖిన్నమతిన్ = దుఃఖముతో; అస్మత్సేనపై = అస్మత్ + సేన + పై = మన సేన మీద; వీడె వచ్చెం = వీడు వస్తున్నాడు; కుంతీసుత = కుంతీ కుమారులలోని; మథ్యముండు = మథ్యలోని వాడు; సమరస్థేమ = సమర + స్థేమ = యుద్ధం చేయాలనే ఉత్సాహంతో; అభిరామాకృతిన్ = అభిరామ + ఆకృతిన్ = మనోహరంగా ఉన్నాడు; | |
సందర్భం – మహాభారతంలోని (తిక్కన వ్రాసినది) విరాట పర్వంలో అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని, యుద్ధానికి వస్తున్న అర్జునుడిని చూసి, ద్రోణాచార్యుడు చెప్పిన మాటలు. భావం: ఒక గుహలో బాధతో, ఆకలితో ఉన్న సింహము బయటకు వచ్చి, భయంకరమైన ఏనుగుల గుంపు మీదకు దూకినట్లుగా, ఇంతకాలం అడవులలో ఉండి, ఇప్పుడు యుద్ధం చేయాలనే ఉత్సాహంతో వస్తున్న అర్జునుడు మనోహరంగా కనిపిస్తున్నాడు. |
Comments
Post a Comment