శా. బావా! యెప్పుడు వచ్చితీవు - 100 పద్యాలు
శా. బావా! ఎప్పుడు వచ్చితీవు | |
బావా! ఎప్పుడు వచ్చితీవు ?సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్? | |
1. బావా! ఎప్పుడు వచ్చితీవు ? 2. సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్? 3. నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును 4. మన్నీలున్ సుఖోపేతులే? | 5. నీ వంశోన్నతి గోరు భీష్ముడును, 6. నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ 7. సేమముమై నెసంగుదురె? 8. నీ తేజంబు హెచ్చించుచున్ |
అర్థాలు: సుఖులే = సుఖంగా ఉన్నారా? భ్రాతల్ = తమ్ములు; సుతుల్ = కొడుకులు;చుట్టముల్ = బంధువులు; వాల్లభ్యము = గొప్పతనము; పట్టు = నిలబెట్టు;మన్నీలున్ = మన నీలుడు; సుఖోపేతులే = సుఖంగా ఉన్నారా?; వంశోన్నతి = వంశ + ఉన్నతి = అభివృద్ధి; కోరు = కోరుకునే; మేల్గోరు = మేలున్ + కోరు = మేలు కోరుకునే; ద్రోణాది = ద్రోణ + ఆది = ద్రోణుడు మొదలైన; భూదేవుల్ = బ్రాహ్మణులు/గురువులు; సేమముమైన్ = క్షేమంగా; నెసంగుదురె = ఉన్నారా?; తేజంబు = గొప్పతనము; హెచ్చించుచున్ = పెంచుతూ. | |
భావం: శ్రీకృష్ణుడు తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన దుర్యోధనుడిని క్షేమం అడుగుతున్న సందర్భము. తిరుపతి వేంకట కవులు వ్రాసిన “పాండవోద్యోగము”అనే పద్యనాటిక లోనిది.
బావా! ఎప్పుడు వచ్చావు? నీ తమ్మళ్లు, పిల్లలు, బంధువులు సుఖంగా ఉన్నారు కదా? నీ గొప్పతనము కోరుకునే కర్ణుడు, నీలుడు సుఖంగా ఉన్నారు కదా? నీ అభివృద్ధి కోరుకునే భీష్ముడు, నీ మంచి కోరుకునే ద్రోణుడు వంటి గురువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ గొప్పతనం తక్కువ కాకుండా ఉన్నది కదా? |
Comments
Post a Comment