ఏ వేదంబు బఠించె - 100 పద్యాలు

 

శా. ఏ వేదంబుఁ బఠించె లూత

 వేదంబుఁ బఠించె లూతభుజగంబే శాస్త్రముల్చూచెఁ దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరిచెంచే మంత్రమూహించెబో
ధావిర్భావనిధానముల్ చదువులయ్యా! కావు! మీపాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా! 

1.      వేదంబుఁ బఠించె లూత

2.    భుజగంబే శాస్త్రముల్చూచెఁ 

3.    దానే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి

4.    చెంచే మంత్రమూహించె 

5.    బోధావిర్భావనిధానముల్

6.    చదువులయ్యా! కావు! 

7.    మీపాద సంసేవాసక్తియె కాక 

8.    జంతుతతికిన్ 

9.    శ్రీకాళహస్తీశ్వరా! 

 వేదంబుఁ ఏ వేదము; పఠించె = చదువుకున్నది; లూత = సాలీడు ; భుజగంబు పాము;

 శాస్త్రములు చూచెఁ = ఏ శాస్త్రములు చూచినది ; తాను = తాను;

ఏ విద్యాభ్యసనంబు = ఏ విద్యలను అభ్యాసము; ఒనర్చెఁ చేసినది; కరి = ఏనుగు;

చెంచు = భక్త కన్నప్ప ; ఏ మంత్రము ఊహించె = ఏ మంత్రాలు తెలుసుకున్నాడు;

బోధావిర్భావ నిధానముల్ = జ్ఞానము పుట్టుటకు కారణం; చదువులయ్యా కావు! చదువులు కాదు;

మీపాద సంసేవాసక్తియె కాక = నీ పాదాల మీద ధ్యాస మాత్రమే; జంతుతతికిన్ = అన్ని ప్రాణులకు;

శ్రీకాళహస్తీశ్వరా! = కాళహస్తిలో నెలకొన్న శివా;

భావం: ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తి శతకంలోని పద్యం. శ్రీకాళహస్తి అనే ఊరు ఉన్నది. శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) కలిసి శివుడిని కొలిచిన చోట, అక్కడ వెలసిన శివుడి మీద వ్రాసిన శతకం.

 

శ్రీ కాళహస్తీశ్వరా! సాలీడు, పాము, ఏనుగు ఏ వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు చదువుకున్నాయి? కానీ శివుడిని గూర్చి ధ్యానించాయి కదా. మోక్షాన్ని పొందాయి కదా. అలాగే అన్ని ప్రాణులకూ, జ్ఞానము కేవలం చదువుల ద్వారానే కాకుండా భగవంతుని మీద కూడా ధ్యాస, భక్తి ద్వారా కలుగుతుంది.

Comments