ఉ. ఎవ్వనిచే జనించు - 100 పద్యాలు

 

ఉ. ఎవ్వనిచే జనించు జగము

వ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దానె యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

1.    ఎవ్వనిచే జనించు జగము

2.    ఎవ్వనిలోపల నుండు లీనమై

3.    ఎవ్వనియందు డిందు 

4.    పరమేశ్వరు డెవ్వడు 

5.    మూలకారణం బెవ్వడు

6.    అనాది మధ్య లయు డెవ్వడు 

7.    సర్వము దానె యైన వాడెవ్వడు 

8.   వాని నాత్మభవున్ 

9.    శ్వరుని

10.  ఏ శరణంబు వేడెదన్

అర్ధాలు:

ఎవ్వనిచే ఎవరి ద్వారాజనించు = పుట్టింది ; జగము = ఈ ప్రపంచము ; లీనమై = కలసిపోయింది; డిందు = ఉన్నది ; మూలకారణం అసలైన కారణం;అనాది మధ్య లయుడు =మొదలు, మధ్య, చివరలు లేనివాడు;సర్వమున్ =అంతా; తానె యైన = తానే అయిన వాడువానిన్ అటు వంటి వాడిని; ఆత్మ భవున్ ఆత్మ స్వరూపుడినిఈశ్వరున్ ఈశ్వరుడినినే నేనుశరణంబు = శరణు; వేడెదన్ = వేడుకొంటాను;

అర్ధం:
ఎవరి ద్వారా ఈ ప్రపంచము పుట్టిందో, ఎవరి లోపల ఈ ప్రపంచము కలసిపోతుందో, ఎవరి లోపల ఈ ప్రపంచము ఉన్నదో, ఎవరు అంతటికీ ఈశ్వరుడో, అన్నిటికీ కారణమైన వాడు ఎవ్వడో, ఎవరు ఆది, అంతమూ లేనివాడో, అంతా తానే అయినవాడో, ఆత్మ స్వరూపుడో – అటువంటి ఈశ్వరుడిని నేను శరణు కోరుకుంటున్నాను.

Comments