ఆరంభింపరు నీచ మానవులు - 100 పద్యాలు

 

శా. ఆరంభింపరు నీచ మానవులు


రంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రాబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

1.     ఆరంభింపరు నీచ మానవులు

2.    విఘ్నాయాస సంత్రస్తులై

3.    ఆరంభించి పరిత్యజించుదురు

4.    విఘ్నాయత్తులై మధ్యముల్

5.    ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ 

6.    ధ్రుత్యున్నతోత్సాహులై

7.     ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ 

8.    ప్రజ్ఞానిధుల్ గావునన్

అర్ధాలు:

ఆరంభింపరు మొదలుపెట్టరునీచ మానవులు = తక్కువ రకం మనుషులు; విఘ్నాయాస = అడ్డంకులు వలనసంత్రస్తులై = భయముతో; యారంభించి  = మొదలుపెట్టిపరిత్యజించుదురు = వదలి పెట్టుదురు ;విఘ్నాయత్తులై  = అడ్డంకులకు లోబడిమధ్యముల్  = మధ్యమ రకంవారు; ధీరుల్ ధైర్యవంతులువిఘ్న =అడ్డంకులు; నిహన్య మానులగుచున్ = లెక్క చేయకుండా; ధ్రుత్యున్నతోత్సాహులై = ముందుకు సాగాలనే ఉత్సాహంతో; ప్రారబ్ధార్ధములు = మొదలు పెట్టిన పనులుఉజ్జగింపరు వదలివేయరుసుమీ = తప్పక ;ప్రజ్ఞానిధుల్ గావునన్ = సామర్ధ్యము ఉన్నవారు కాబట్టి;

భావం:

భర్తృ హరి సంస్కృతంలో వ్రాసిన సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి తెలుగులోకి అనువదించాడు. ఈ పద్యం పట్టుదలతో పనులు చేసే వారి గొప్పతనం గురించి చెబుతున్నది.

 
తక్కువ రకం మనుషులు, అడ్డంకులు వస్తాయని పనులను మొదలుపెట్టరు. మధ్యమ రకం మనుషులు మొదలుపెట్టిన పనులను, ఏదైనా అడ్డంకులు రాగానే వదలివేస్తారు. కానీ, అడ్డంకులు వచ్చినా దాటుకుంటూ ముందుకు పోతూ, మొదలు పెట్టిన పనులను సాధించేవారే గొప్పవారు.

Comments