మ. కొడుకుల్ పుట్టరటంచు - 100 పద్యాలు

 

మ. కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు


కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
సెం బుత్త్రులులేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!

 

1.    కొడుకుల్‌ పుట్టరటంచున్

2.    ఏడ్తురు అవివేకుల్ 

3.    జీవనభ్రాంతులై 

4.    కొడుకుల్‌ పుట్టరె 

5.    కౌరవేంద్రునకు అనేకుల్ 

6.    వారిచేన్ ఏగతుల్‌ వడసెం 

7.    పుత్త్రులు లేని యా శుకునకున్‌ 

8.    వాటిల్లెను ఏ దుర్గతుల్‌

9.    చెడునే మోక్షపదంబు అపుత్త్రకునకున్‌

10.  శ్రీకాళహస్తీశ్వరా!

అర్ధాలు:

కొడుకులు కుమారులు; పుట్టరటంచు = పుట్టరు అటంచు పుట్టలేదని అంటూ; ఏడ్తురు ఏడ్చెదరు; అవివేకులు ఆలోచన లేనివారు; జీవన భ్రాంతుతై అయోమయంతో; పుట్టరె =పుట్టలేదా; కౌరవేంద్రుడు దృతరాష్ట్రుడుఅనేకుల్ అనేక మందివారిచేన్ = వారిచేత ఏగతుల్ = ఎటువంటి స్థితి; వడసెం = అనుభవించాడు; పుత్రులులేని = కుమారులు లేని ఆ = అటువంటి; శుకునకు శుక మహర్షికి; అపుత్రునకు పుత్రులు లేని వారికి; మోక్ష పదం మోక్షము; 

భావం: ఈ పద్యం దూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది.

 

ఓ శ్రీకాళహస్తీశ్వరా! వివేకం లేనివారు కుమారుల పుట్టలేదని బాధపడతారు. ఆ కౌరవరాజు దృతరాష్ట్రుడు అనేక మంది కొడుకులను కనలేదా? మరి వారి వలన ఏ గొప్ప స్థితిని పొందాడు? పుత్రులు లేని శుక మహర్షి ఏమైనా చెడిపోయాడా? మోక్షము కుమారులు లేనివారికి సిద్ధించకుండా ఉండదు కదా. కేవలం సాధన వలనే మోక్షము కలుగుతుంది అని భావన.

Comments