శా. సంతోషంబున సంధి - 100 పద్యాలు
శా. సంతోషంబున సంధి | |
సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ- | |
1. సంతోషంబున సంధి సేయుదురె 2. వస్త్రంబూడ్చుచో 3. ద్రౌపదీ కాంతన్ జూసిన నాడు 4. చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు 5. నీ పొంతన్ | 6. నీ సహ జన్ము 7. రొమ్ము రుధిరంబుం ద్రావు నాడేనిన్ 8. నిశ్చింతన్ 9. తద్గదయున్, త్వదూరు యుగమున్ 10. ఛేదించు నాడేనియున్ |
సంతోషంబున = సంతోషముతో; సంధి = సంధి; సేయుదురె = చేసుకుంటారా?;వస్త్రంబూడ్చుచో = వస్త్రంబు + ఊడ్చుచో = చీరలు తొలగించినప్పుడు; ద్రౌపదీకాంతన్ =ద్రౌపదిని; జూసిన నాడు = చూచిన నాడు; చేసిన = చేసిన; ప్రతిజ్ఞల్ = ప్రతిజ్ఞలు; దీర్ప =నిలుపకోవాలని; భీముండు = భీముడు; నీ పొంతన్ = నీ ఎదురుగా; నీ సహ జన్ము = నీ తోడబుట్టిన వాని (దుశ్శాసనుడి); రొమ్ము = గుండెల; రుధిరంబుం = రక్తము; త్రావు = త్రాగు;నాడేని = నాడు అయినా ; నిశ్చింతన్ = తప్పక; తద్గదయున్ = తత్ గదయున్ = నీ గదను;త్వదూరు = తత్ ఊరు = నీ తొడలు ; యుగమున్ = రెండింటిని ; ఛేదించు = పగులగొట్టు;నాడేనియున్ = నాడు అయినా ; | |
భావం: తిరుపతి వేంకట కవులు వ్రాసిన పాండవోద్యోగం అనే పద్య నాటకంలో శ్రీకృష్ణుడు రాయబారం సందర్భంలో దుర్యోధనుడికి చెప్పిన పద్యం.
దుర్యోధనా! ఈ వేళ సంతోషంగా సంధి చేసుకుంటారా? లేకపోతే ఆనాడు ద్రౌపది బట్టలు లాగినప్పుడు భీముడు తాను చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాలని, నీ ఎదురుగా దుశ్శాసనుడి గుండెలు పగులగొట్టి రక్తము త్రాగునప్పుడు సంధి చేసుకుంటావా? లేక నీ గదను, నీ తొడలు రెండింటిని పగులగొట్టిన నాడు సంధి చేసుకుంటావా? |
Comments
Post a Comment