మ. అదిగో ద్వారక - 100 పద్యాలు
మ. అదిగో ద్వారక! | |
అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ | |
1. అదిగో ద్వారక! 2. ఆలమందలవిగో అందందు గోరాడు! 3. అయ్యదియే కోట, అదే అగడ్త, 4. అవె రథ్యల్, వారలే యాదవుల్! | 5. యదుసింహుండు వసించు మేడ యదిగో! 6. ఆలాన దంతావళాభ్యుదయంబై 7. వర మందురాంతర 8. తురంగోచ్చండమై పర్వెడిన్! |
అర్ధాలు: అదిగో ద్వారక = అదిగో ద్వారకా నగరం; ఆలమందలవిగో = గోవుల గుంపులు; అందందు గోరాడు! = అక్కడంతా తిరుగుతున్నాయి ; అయ్యదియే కోట = అదే కోట ; అదే అగడ్త = కందకము (కోట చుట్టూతా ఉండే గోతులు, Trench); అవె రథ్యల్ = రథాల మార్గాలు; వారలే యాదవుల్ = వారే యాదవులు; యదుసింహుండు = యాదవుల సింహము (శ్రీకృష్ణుడు); వసించు = ఉండే; మేడ యదిగో = భవనము అదిగో; ఆలాన = స్తంభము; దంతావళ = ఏనుగుల;అభ్యుదయంబై = వెలిగిపోతూ; వర = శ్రేష్ఠమైన; మందుర = గుర్రపు శాల; అంతర = మొత్తము ; తురంగోచ్చండమై = తురంగ ఉచ్చండమై = గుర్రాలతో నిండనదై; పర్వెడిన్ = ఉన్నది; | |
భావం: తిరుపతి వేంకట కవులు వ్రాసిన పాండవోద్యోగం అనే పద్య నాటకంలో శ్రీకృష్ణుడు దగ్గరకు వస్తున్న అర్జునుడు అంటున్న మాటలు. అదిగో ద్వారకా నగరము! అవిగో ఆవుల మందలు ఉన్నాయి! అదిగో కోట! అదిగో దాని చుట్టూ కందకము. అదిగో రథాలు వెళ్లే మార్గము. వారందరూ యాదవులు! వారి నాయకుడు శ్రీకృష్ణుడు ఉండే భవనం అదిగో! ఏనుగులను కట్టే స్తంభాలతో, గుర్రపు శాలలు నిండా గొప్ప గుర్రాలలతో గొప్పగా ఉన్నాయి! |
Comments
Post a Comment