జెండాపై కపిరాజు - 100 పద్యాలు
శా. జెండా పై కపిరాజు | |
జెండా పై కపిరాజు, ముందు శిత వాజిశ్రేణియుం పూంచినే | |
1. జెండా పై కపిరాజు 2. ముందు శిత వాజి శ్రేణియుం పూంచి 3. నే దండంబును గొని తోలు సెందనము మీదన్ 4. నారి సారించుచున్ | 5. గాండీవము ధరించి ఫల్ఘునుడు 6. మూకన్ చెండుచున్నప్పుడు 7. ఒక్కండును నీ మొర ఆలకింపడు! 8. కురుక్ష్మానాధ సంధింపగన్! |
అర్ధాలు: జెండా = పతాకం; కపిరాజు = కపి + రాజు = హనుమంతుడు; సిత = తెల్లని; వాజి = గుర్రము; శ్రేణి = వరుస; పూంచి (కూర్చి) = ఉంచి; నే = నేను; దండంబు = కర్ర, చెర్నాకోల; కొని =పట్టుకొని; తోలు = నడిపించు; స్యందనము = రథము; నారి = వింటి నారి; సారించుచున్ = లాగుచూ; ధరించి = పట్టుకొని; ఫల్గునుడు = అర్జునుడు; మూకన్ = గుంపును, శత్రువుల మూకను; చెండుచు = ఓడించు; మొర = ప్రార్థన ; ఆలకింపడు = వినడు; కురుక్ష్మానాథ = కౌరవుల రాజు!; సంధింపగన్ =సంధి చేయుట కొరకు. | |
భావం: తిరుపతి వేంకట కవులు వ్రాసిన పాండవోద్యోగం అనే పద్య నాటకంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పిన మాటలు.
ఓ దుర్యోధనా! జెండా పైన హనుమంతుడు ఉండగా, తెల్లని గుర్రాలను కట్టుకుని, చెర్నాకోలతో నేను రథము నడుపుతుండగా, అర్జునుడు తన వింటి నారిని లాగుతూ శత్రువుల గుంపులను చెండాడుతున్న సమయంలో, సంధి చేసుకోవాలనే నీ మొరను ఎవరూ వినరు. ఇప్పుడే సంధి చేసుకో అని భావన. |
Comments
Post a Comment