ఉ. అన్నములేదు కొన్ని - 100 పద్యాలు

 

9-647-ఉ. అన్నము లేదు కొన్ని

న్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవిత్రావు మన్న! రా
న్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్
గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదెనాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!

1.     అన్నము లేదు 

2.    కొన్ని మధురాంబువు లున్నవి;

3.    త్రావు మన్న! 

4.    రావన్న! 

5.    శరీరధారులకున్ 

6.    ఆపద వచ్చిన

7.     వారి యాపదల్ గ్రన్నన మాన్చి 

8.    వారికి సుఖంబులు చేయుటకన్న 

9.    నొండు మేలున్నదె

10. నాకు దిక్కు 

11.  పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము

12. పుల్కసా!

మధురాంబువు లున్నవి మధుర + అంబువులు ఉన్నవి తీయని నీళ్లు ఉన్నాయిత్రావు మన్న= త్రావుము అన్న= త్రాగు నాయనా ; రా వన్న = రా నాయనా ; శరీరధారులకు = జీవులకు; ఆపద = కష్టం; క్రన్నన = వెంటనే ; మాన్చి = తగ్గించి ;  ఒండు = ఇంకొకటి ; మేలున్నదె = మేలు ఉన్నదె  మంచి పని ఉన్నదా; పురుషోత్తముడు = విష్ణువు ; చమ్ము  సుమ్ము  తప్పకుండా; పుల్కసా  చండాలా;

సందర్భం: పోతన భాగవతములోని నవమ స్కంధంలోని, రంతిదేవుని చరిత్రము అనే కథలోనిది. రంతిదేవుడు తన దగ్గరున్న అన్నము దానం చేసాడు. కొంచెం నీరు మిగిలినది. ఆ నీరు కూడా దానం చేయడానికి సిద్ధపడ్డాడు.

 

అర్ధం: నాయనా, నా దగ్గర అన్నము లేదు. కొంచెం నీరు ఉన్నది. త్రాగు నాయనా!. రా నాయనా! జీవులకు వచ్చే కష్టాలను మాన్చి వారికి సుఖము కలుగ చేయటం కన్నా వేరే మంచి పని ఉన్నదా? నాకు ఆ విష్ణువే దిక్కు.

Comments