శా. శ్రీ కైవల్యపదంబు - 100 పద్యాలు
శా. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై | |
శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర | |
1. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై 2. చింతించెదన్ 3. లోకరక్షైకారంభకు 4. భక్తపాలన కళా సంరంభకున్ 5. దానవోద్రేకస్తంభకు | 6. కేళిలోల 7. విలసద్దృగ్జాల 8. సంభూత 9. నానా కంజాత భవాండకుంభకు 10. మహానందాంగనా డింభకున్ |
అర్ధాలు: శ్రీ కైవల్యపదంబు = మోక్షపదం; చేరుటకునై = చేరు కోవటం కొరకు; చింతించెదన్ = ప్రార్ధన చేస్తాను; లోకరక్షైకారంభకు = లోకరక్షణ చేసేవాడిని; భక్తపాలన కళా = భక్తును పాలించడం అనే కళలో; సంరంభకున్ = ఉత్సాహం చూపించేవాడిని; దానవోద్రేకస్తంభకు = రాక్షసుల ఉద్రేకాన్ని ఆపేవాడిని; కేళిలోల = ఆట మాత్రంగా; విలసద్దృగ్జాల = విలాసంగా తన చూపుద్వారా; సంభూత = పుట్టిన; నానా కంజాత భవాండ = వివిధ బ్రహ్మాండాలు; కుంభకు = కుండలు తనలో కలవాడు; మహానందాంగనా = గొప్ప నందుని భార్య యొక్క; డింభకున్ = బిడ్డడు; | |
భావం: పోతన భాగవతంలోని మొదటి పద్యం ఇది. పోతన మోక్షాన్ని కోరుకుంటూ భాగవతం వ్రాస్తున్నాని చెప్తున్నారు. లోకరక్షణే చేసేవాడు, భక్తులని ఆదుకోవడంలో ఉత్సాహం చూపించేవాడు, రాక్షసుల ఆటకట్టించేవాడు, విలాసంగా అలవోకగా కేవలం తన చూపులతోనే పుట్టిన అనేక బ్రహ్మాండాలను తన యందు కలవాడు, మహా నందాంగుని ఇల్లాలైన యశోదమ్మ బిడ్డడు అయిన శ్రీ కృష్ణుణ్ణి కైవల్యం కోసం ప్రార్థిస్తాను. |
Comments
Post a Comment