మ. కురువృద్ధుల్ - 100 పద్యాలు

 

మ. కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌

కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో 
ద్ధురుడైద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ 
లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘని
ర్ఝముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్

1.    కురువృద్ధుల్ 

2.    గురువృద్ధబాంధవులనేకుల్ 

3.    సూచుచుండన్ 

4.    మదోద్ధురుడైద్రౌపది నిట్లు చేసిన ఖలున్ 

5.    దుశ్శాసనున్ 

6.    లోకభీలీలన్ వధియించి 

7.    తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ నిర్ఝరము 

8.    ఉర్వీపతి సూచుచుండన్ 

9.     అని నాస్వాదింతు నుగ్రాకృతిన్

అర్ధాలు:

కురువృద్ధుల్ కురువంశములో పెద్దవారుగురు గురువులువృద్ధబాంధవులు  = పెద్దలు, బంధువులు ; అనేకుల్ అనేక మందిసూచుచుండన్  చూస్తుండగామదోద్ధురుడై  = మద ఉద్ధరుడై = మదము హెచ్చినవాడైద్రౌపదిని  ద్రౌపదినిఇట్లు చేసిన ఇలా చేసిన; ఖలున్ నీచుడునిదుశ్శాసనున్ దుశ్శాసనుడినిలోకభీలీలన్  అతి భయంకరముగా; వధియించి  చంపి;తద్విపుల  తత్ విపుల ఆ విశాలమైన; వక్షశ్శైల  ఎత్తైన గుండెల; రక్తౌఘ  = రక్త + ఔఘ రక్త ప్రవాహ; నిర్ఝరము  ధార; ఉర్వీపతి రారాజు (దుర్యోధనుడు); సూచుచుండన్ చూస్తుండగా;అనిన్  యుద్ధములో; ఆస్వాదింతున్  త్రాగుతాను; ఉగ్రాకృతిన్ = ఉగ్ర ఆకృతిన్ భయంకరముగా;

భావం: కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎఱ్ఱన) వ్రాసిన మహాభారతంలోని సభాపర్వంలోని పద్యం. ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడిని చూసి భీముడు చేసిన ప్రతిజ్ఞ.

 

కౌరవులు, గురువులు, పెద్దవారు, బంధువులు అందరూ చూస్తుండగా, గర్వముతో ద్రౌపదిని ఇలా చేసిన నీచమైన దుశ్శాసనుడిని, ఈ దుర్యోధనుడు చూస్తుండగా, యుద్ధములో, అతి భయంకరముగా చంపి, ఆ గుండెల నుండి రక్తము ఏరులై పారుతుంటే దానిని త్రాగుతాను.

Comments