మ. అల వైకుంఠపురంబులో - 100 పద్యాలు
మ. అల వైకుంఠ పురంబులో | |
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా | |
1. అల వైకుంఠ పురంబులో 2. నగరిలోన్ 3. ఆ మూల సౌధంబు దాపల 4. మందార వనాంతర 5. అమృత సరః ప్రాంత 6. ఇందుకాంతోపల | 7. ఉత్పల పర్యంక 8. రమా వినోదియగున్ ఆపన్నప్రసన్నుండు 9. విహ్వల నాగేంద్రము 10. “పాహి , పాహి ‘” యన 11. గుయ్యాలించి 12. సంరంభియై |
అర్ధాలు: అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; మూల సౌధంబు = ప్రధాన మేడ; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; సరస్ = సరోవరము; ఇందుకాంత = చంద్రకాంత శిల(marble); ఉప = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = స్వాధీనముతప్పిన, నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడుతున్న వాడు; | |
భావం: ఈ పద్యం పోతన వ్రాసిన భాగవతంలోని అష్టమ స్కంధంలోని, గజేంద్రమోక్షణ ఘట్టంలోనిది. కష్టంలో ఉన్న గజేంద్రుని మొర వైకుంఠంలో ఉన్న శ్రీహరికి వినిపించింది.
అక్కడ ఉన్న వైకుంఠ మనే చోట, ప్రధాన భవంతి దగ్గర, మందార పూల తోట లోపల, అమృత సరస్సు ప్రాంతంలో, చంద్రకాంత శిలలపైన, కలువల పాన్పుపైన, లక్ష్మీదేవితో, కష్టాలలో ఉన్న వారిని అనుగ్రహించే శ్రీహరి, స్వాధీనము తప్పి, “పాహీ పాహీ” అనే మొర విని, గబగబా లేచి... |
Comments
Post a Comment