ఉ. అక్కట! యమ్మహారణము - 100 పద్యాలు

 

ఉ. అక్కట! యమ్మహారణము

క్కట! యమ్మహారణమునందు వియచ్చరకోటితోడఁ బే 
రుక్కునఁ బోరి యేను మృతి నొందఁగ నేరనయట్టు లైన నీ 
క్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్; 
మిక్కిలి యైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై

1.    అక్కట! యమ్మహారణమునందు

2.    వియచ్చరకోటితోడఁ బేరుక్కునఁ బోరి యేను

3.    మృతి నొందఁగ నేరన

4.    యట్టు లైన

5.    నీ తక్కువపాటు లేక 

6.    ప్రమదంబున దేవపదంబు నొందుదున్‌ 

7.    మిక్కిలి యైన కీర్తియును 

8.    మేదినియందు వెలుంగు నిత్యమై

అక్కట! అయ్యోయమ్మహారణమునందు ఆ మహాయుద్ధములోవియచ్చరకోటితోడఁ శత్రుకోటితోరుక్కునఁన్ = ఏ కోరికతోపోరి యేను పోరు చేసాను;  మృతి నొందఁగ నేరన ఎందుకు చనిపోలేదుయట్టు లైన అట్లు జరిగితేనీ తక్కువపాటు లేక ఈ అవమానము లేకప్రమదంబున సంతోషముగాదేవపదంబు నొందుదున్‌ స్వర్గప్రాప్తి జరిగేదిమిక్కిలి యైన కీర్తియును చక్కటి కీర్తి కూడా;  మేదినియందు భూమిమీదవెలుంగు ప్రకాశించేదినిత్యమై నిత్యమూ;

భావంఆంధ్రమహాభారతం లోని ఎఱ్ఱన వ్రాసిన అరణ్యపర్వంలోనిది. పాండవులను అవమానించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఘోషయాత్ర చేశాడు. అనుకోకుండా గంధర్వుల చేతిలో బందీ అయ్యాడు.  పాండవులే వచ్చి రక్షించారు. దుర్యోధనుడు, దానిని అవమానంగా భావించి ప్రాయోపవేశం చేయాలనుకున్నాడు.

 

అయ్యో! ఆ మహాయుద్ధములో శత్రువులతో ఏమి కోరి పోరు చేసాను. చనిపోనైనా లేదు. అట్లు చనిపోయి ఉంటే ఈ అవమానము లేక సంతోషముగా స్వర్గాన్ని పొందేవాడిని. చక్కని, నిత్యమైన కీర్తి కూడా కలిగేది. 

Comments