చ. తెలివి యొకింత లేనియెడ - 100 పద్యాలు

 

చ. తెలివి యొకింత లేనియెడ


తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లియిప్పు డు
జ్జ్వమతులైన పండితుల న్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

1.    తెలివి యొకింత లేని యెడన్

2.    తృప్తుడనై 

3.    కరి భంగి 

4.     సర్వమున్ దెలిసితినంచు 

5.    గర్విత మతిన్

6.     విహరించితి దొల్లి  

7.     యిప్పుడు ఉజ్జ్వలమతులైన 

8.     పండితుల సన్నిధిన్ 

9.     ఇంచుక బోధశాలినై

10.  తెలియనివాడనై మెలగితిం 

11.  గతమయ్యె 

12.  నితాంత గర్వముల్

అర్ధాలు:

తెలివి తెలివి; యొకింత = ఒకింత కొంచెం; తృప్తుడనై తృప్తి చెందిన వాడినై; కరి ఏనుగు; భంగి వలెనే; సర్వము అంతా; గర్వము గర్వము, అహంకారము; తొల్లి ఇదివరకు; ఉజ్వల గొప్ప; పండితులు పండితులు; ఇంచుక కాస్త; మెలంగితిం ప్రవర్తించాను; గతమయ్యె పోయింది;

భావం: భర్తృహరి సంస్కృతంలో వ్రాసిన సుభాషితాలను తెలుగులో ఏనుగు లక్ష్మణకవి వ్రాసారు. 

 

నాకు తెలివి కొంచె ఉన్నప్పుడు, తృప్తి చెంది, అహంకారంతో మదించిన ఏనుగులాగ, అంతా తెలిసినట్లు ప్రవర్తించాను. తరువాత పండితుల ద్వారా విషయాలు నేర్చుకుని, వాడిలాగ ఒదిగి ఉండటం నేర్చుకున్నాను.  నాకు ఉన్న గర్వము అంతా పోయింది.

Comments