మ. కటి చేలంబు బిగించి - 100 పద్యాలు

 

మ. కటి చేలంబు బిగించి

టి చేలంబు బిగించిపింఛమున జక్కం గొప్పు బంధించిదో
స్త సంస్ఫాలన మాచరించిచరణద్వంద్వంబు గీలించి
త్కుశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానం బనూనంబుగన్

1.     టి చేలంబు బిగించి 

2.     పింఛమున జక్కం గొప్పు బంధించి

3.     దోస్త సంస్ఫాలన మాచరించి

4.     చరణద్వంద్వంబు గీలించి 

5.     త్కుశాఖాగ్రము మీదనుండి

6.     యుఱికెన్ 

7.     గోపాలసింహంబు 

8.     దిక్తముల్ మ్రోయ 

9.     హ్రదంబులో 

10.  గుభగుభధ్వానం బనూనంబుగన్

ర్థాలుకటి నడుము; చేలంబు బట్ట, ఉత్తరీయముబిగించి = గట్టిగా కట్టి ;పింఛమునన్ = పింఛాన్నిక్కం = చక్కగాగొప్పు = జుట్టుముడిలోబంధించి బంధించిదోస్తట = చేతులతో ; సంస్ఫాలన = చరచుకొనిమాచరించి = చేసి; చరణద్వంద్వంబు రెండు కాళ్లనుగీలించి దగ్గర చేసి; త్కుట = తత్ కుట ఆ చెట్టుశాఖాగ్రము = పైకొమ్మమీదనుండి = మీద నుండియుఱికెన్ = ఉరికినాడు ; గోపాలసింహంబు = గోపాలుడనే సింహముదిక్ = దిక్కులు,  తటము =  ప్రదేశంమ్రోయ = అదిరి పడగాహ్రదంబులో = చెరువులోకిగుభగుభధ్వానంబు = గుభగుభ మనే శబ్దం ; నూనంబుగన్ అంతా నిండిపోయినది;

భావంఈ పద్యం పోతన వ్రాసిన భాగవతంలోనిది. కాళింది అనే సరస్సులో కాళీయుడు అనే పెద్ద పాము ఉన్నది. దాని విష ప్రభావం వలన చాలా జంతువులు చనిపోయేవి. శ్రీకృష్ణుడు దానికి గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో సరస్సులోకి దూకాడు.

 

ఉత్తరీయాన్ని నడుముకి గట్టిగా బిగించాడు. పింఛాన్ని చక్కగా జుట్టు ముడిలో బంధించాడు. జబ్బలు రెండూ చరచుకున్నాడు. కాళ్ళనీ దగ్గరగా ఉంచాడు. సింహలాంటి శ్రీకృష్ణుడు, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి ఉరికి దూకాడు. అంతేగుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయింది!

 

Comments