ఉ. నల్లనివాడు - 100 పద్యాలు

 

ఉ. నల్లనివాడు

ల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై
ల్లెడువాడు మౌళి పరిర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో! 
ల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే!


1.     నల్లనివాడు

2.    పద్మనయనంబులవాడు

3.    కృపారసంబు పైజల్లెడువాడు

4.    మౌళి పరిర్పిత పింఛమువాడు

5.    నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు 

6.    చెల్వల మానధనంబు దెచ్చెన్ 

7.     ఓ! మల్లియలార! 

8.    మీ పొదలమాటున లేడు గదమ్మ!

9.    చెప్పరే!

పద్మనయనంబుల వాడు = పద్మాల వంటి కన్నులుకలవాడు; కృపారసంబున్ = దయను; 

పైన్ = మీద;  చల్లెడువాడు = చిలికెడివాడు;  మౌళి = సిగ యందు;  పరిసర్పిత = చుట్టబడిన; 

పింఛమువాడు = నెమలి పింఛము గలవాడు;  రాజిల్లెడు = ప్రకాశించెడి;మోమువాడు = ముఖము కలవాడు చెల్వలన్ = స్త్రీల; మాన = శీలము అనెడి; 

ధనంబున్ = సంపదనుమల్లియలారా = మల్లెపూలు పొదలన్ = పొదలలో; 

మాటున = దాగుకొని;  చెప్పరే = చెప్పండి.

భావంపోతన వ్రాసిన భాగవతంలోని పద్యం. శ్రీకృష్ణుడు కనిపించక పోయేసరికి గోపికలు కనిపించిన చెట్లను, మొక్కలను అడుగుతున్నారు (10.1.1012-ఉ).

ఓ మల్లియలారా! నల్లటి వాడు, పద్మాలవంటి పెద్ద కన్నులు కలవాడు, కరుణను కురిపించేవాడు, సిగలో నెమలి పింఛము పెట్టుకున్నవాడు, నవ్వులు చిందించేవాడు, మా అందరి సిగ్గును దొంగిలించి తెచ్చినవాడు, మీ పొదల వెనుక దొక్కున్నాడా? చెప్పండమ్మా!

Comments