చ. నుతజల పూరితంబులగు - 100 పద్యాలు

 

చ. నుతజల పూరితంబులగు


నుజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్ర! యొక బావి మేలుమఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతువది మేలుతత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు
త్సు శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడఁగన్

1.     నుతజల పూరితంబులగు 

2.    నూతులు నూఱిటి కంటె 

3.    సూనృత వ్రత! 

4.    యొక బావి మేలు

5.    మఱి బావులు నూఱిటి కంటెన్ 

6.    ఒక్క సత్క్రతువది మేలు 

7.     తత్క్రతు శతంబున కంటె 

8.    సుతుండు మేలు

9.    తత్సుత శతకంబు కంటెన్ 

10. ఒక సూనృత వాక్యము మేలు 

11.  సూడఁగన్‌.

అర్ధాలు: 


నుత = మంచి; జల = నీరుపూరితంబులగు = నిండుగా ఉన్న; నూతులు =నూతులునూఱిటి కంటె = వంద కన్నాసూనృతవ్రత! = మంచి పనులు చేయాలని సంకల్పము ఉన్న మహారాజా!; యొక బావి = ఒక బావి; మేలు = మంచిదిమఱి = మరిసత్క్రతువది = సత్ + క్రతువు అది = మంచి యజ్ఞముతత్క్రతు = తత్ + క్రతు = అటువంటి యజ్ఞముశతంబు = వందసుతుండు = కొడుకుతత్సుత = తత్ + సుత = అటువంటి కొడుకుసూనృత = మంచివాక్యము = మాటలుసూడఁగన్ = చూడగా, ఆలోచించగా;

భావం: 


ఈ పద్యం మహాభారతంలోని ఆదిపర్వములో ఉన్న శకుంతల దుష్యంతుని కథలోనిది. తనను గుర్తించని దుష్యంతునితో శకుంతల మాట్లాడుతున్న మాటలు.

 

సత్యము వ్రతమున్న మహారాజా! ఆలోచిస్తే, మంచి నీరున్న వంద నూతుల కంటే ఒక్క బావి మేలు. అటువంటి వంద బావులు కంటే ఒక యజ్ఞము మేలు. అటువంటి వంద యజ్ఞాల కంటే ఒక కొడుకు మేలు. అటువంటి వందమంది కొడుకుల కంటే ఒక మంచి సత్య వాక్యము మేలు.

Comments