శా. దుర్వారోద్యమ బాహువిక్రమ - 100 పద్యాలు

 

శా. దుర్వారోద్యమ బాహువిక్రమ


దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబెమ్మెయిం కీచకా


1.     దుర్వారోద్యమ 

2.     బాహువిక్రమ రసాస్తో

3.     ప్రతాపస్ఫురత్ ర్వాం

4.     ప్రతివీర నిర్మథన 

5.     విద్యాపారగుల్ మత్పతుల్

6.     గీర్వాణాకృతులు 


7.     ఏవురిప్డు నిను 

8.    దోర్లీలన్ వెసం గిట్టి 

9.     గంర్వుల్ 

10.  మానము ప్రాణముం గొనుట 

11.   థ్యంబెమ్మెయిం కీచకా

 

అర్ధాలు:

దుర్వార = గొప్పఉద్యమ = ప్రయత్నంగలబాహు విక్రమ రస = భుజబలం చేతఅస్తోక = తక్కువగాని;ప్రతాప = పరాక్రమంచేతస్ఫురత్ = ప్రకాశిస్తున్నటువంటిగర్వ అంధ = గర్వంచేత కనులు మూసుకుపోయినప్రతివీర =శత్రువులనునిర్మథన=చంపటమనేవిద్యాపారగుల్=విద్యలో ఆరితేరిన;మత్ పతుల్ నా భర్తలుగీర్వాణాకృతులు = గీర్వాణ ఆకృతులు = దేవత వంటి వారు; ఏవురిప్డు ఏవురు ఇప్డు ఐదుగురు ఇప్పుడు; నిను = నిన్ను; దోర్లీలన్ తమ భజబలముతో; వెసం గిట్టి =వెంటనే పడగొట్టి; గంధర్వుల్ గంధర్వులు; కొనుట = తీసుకొనుట; తథ్యంబెమ్మెయిం తథ్యంబు +ఎమ్మెయిం = తప్పదు; కీచకా = ఓ కీచకా!

సందర్భం – మహాభారతంలోని (తిక్కన వ్రాసినది) విరాట పర్వంలో ద్రౌపది కీచకునికి చెప్పిన మాటలు.

 

భావం: 

ఓ కీచకా! తమతమ పరాక్రమంచేతా, బాహుబల గర్వంతోనూ కళ్లు మూసుకుపోయిన శత్రువులను పడగొట్టటంలో నా భర్తలు ఆరితేరినవారు. దేవతల రూపంలో ఉన్న ఆ ఐదుగురు గంధర్వులు నిన్ను తమ కండబలంతో పడగొట్టుట తప్పదులే!

Comments