చ. అలుగుటయే - 100 పద్యాలు
చ. అలుగుటయే యెరుంగని | |
అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే | |
1. అలుగుటయే యెరుంగని 2. మహా మహితాత్ముడు 3. అజాత శత్రుడే 4. అలిగిన నాడు 5. సాగరము లన్నియున్ | 6. ఏకము కాక పోవు 7. కర్ణులు పది వేవురైనన్ 8. అని నొత్తురు చత్తురు రాజ రాజ 9. నా పలుకుల విశ్వసింపుము 10. విపన్నుల నార్తుల గావుమెల్లెడన్ |
అలుగుటయే = కోపించడమే; ఎరుంగని = తెలియని; మహా మహితాత్ముడు = చాలా మంచివాడు;అజాత శత్రుడు = శత్రువులు లేనివాడు; అలిగిన నాడు = కోపం చేసినాడు; సాగరము లన్నియున్ = సముద్రాలన్నీ; ఏకము కాక పోవు = కలసి ఒకటిగా మారతాయి; కర్ణులు పది వేవురైనన్ = కర్ణులు లాంటివారు పదివేలమందైనా; అని నొత్తురు = బాధపడతారు; చత్తురు = చనిపోతారు; రాజ రాజ = ఓ దుర్యోధనా; నా పలుకుల = నా మాటలను; విశ్వసింపుము = నమ్ము; విపన్నులన్ = కష్టాలాలలో ఉన్నవారిని; ఆర్తులన్ = అర్థించేవారిని; కావుమెల్లెడన్ = కావుము + ఎల్లెడన్ = ఎల్లప్పుడూ రక్షించు; | |
భావం: తిరుపతి వేంకట కవులు వ్రాసిన పాండవోద్యోగం అనే పద్య నాటకంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పిన పద్యం.
ఓ రారాజా! ధర్మరాజుకు కోపమే తెలియదు. చాలా మంచివాడు. అతనికి శత్రువులు లేరు. అలాంటి ధర్మరాజుకు కోపమొస్తే సముద్రాలన్నీ పొంగి కలసిపోయి గొప్ప ప్రళయం వస్తుంది. కర్ణులు లాంటి వారు పదివేల మంది వచ్చినా ఓడిపోతారు. చనిపోతారు. నా మాటలు నమ్ము. అలాంటి కష్టాల రాకుండా, నీ వారిని రక్షించుకో. |
Comments
Post a Comment