అయోధ్యాకాండ: 471-477 - శ్రీరాముడు లక్ష్మణుని శాంత పరచుట - రంగనాథ రామాయణం

 సందర్భము: శ్రీరాముడు, దుఃఖిస్తున్న కౌసల్యను, కోపిస్తున్న లక్ష్మణుడిని శాంత పరచుట.

అయోధ్యాకాండ: 471-477 

మిటి కీమాట ? లింత శోకింప - నేమిటి" కని రాము డేర్పడఁ బలికె
"బలువిడి తమ తండ్రి నుపునఁ దొల్లి - మునఁ దమతల్లిఁ జంపె భార్లవుఁడు. 
గని కినుకమైఁ మతండ్రి పనుప - గున నొక గోవుఁ జంపెఁ గుండినుఁడు 
 మనోహరమైన తారుణ్య మొసఁగి -  తండ్రి ముదిమియుఁ దాల్బె బూరుండు 
తండ్రి పనుపునఁ ద్రవ్వరే తొల్లి - కించి సగరనంను లంబునిధిని
డఁగి తండ్రిదిపంపుఁ గైకొని నాకు - వుల నుండుట ది యెంత పెద్ద 
నీ ల్లభుని మాట నీకును నాకు - భావించి సేయుట రమధర్మంబు
 క్షణుఁడు బాలు, డేమియు నెఱుఁగఁ - జాలఁడు వీరవిచారంబె కాని"

భావం : "ఏమిటీ మాటలు? ఇంత శోకించటం ఎందుకు?" అంటూ రాముడు ఇలా పలికాడు - "పరశురాముడు, తండ్రి మాట ప్రకారం తల్లినే చంపినాడు. కుండినుడు, తన తండ్రి మాటను అనుసరించి గోహత్య చేసినాడు. పూరుండు, తన తండ్రి కోసం ముసలితనాన్ని దాల్చాడు. సగరుని కొడుకులు తండ్రి మాట ప్రకారం సముద్రాలు త్రవ్వినారు. అలాంటిది, తండ్రి మాట ప్రకారం అడవులకు పోవటం పెద్ద విషయం కాదు. ఆ దశరథుని మాట ప్రకారం చేయటం నీకు, నాకు పరమ ధర్మము. ఈ లక్ష్మణుడు చిన్నవాడు, ఏమీ తెలియని వాడు. వీరోచితంగా మాట్లాడుతున్నాడు అంతే."

పలువ = దుర్జనుడు
పనుపు = పంపు, ఆజ్ఞాపించు
సరగున = శ్రీఘ్రముగా, త్వరగా
తమకించు = త్వరగా

--
రంగనాథ రామాయణం - PDF - https://archive.org/details/in.ernet.dli.2015.329074/
ఛందస్సు రంగులు - http://chandam.apphb.com/

Comments