ఉ. సారపు ధర్మమున్ - 100 పద్యాలు
ఉ. సారపు
ధర్మమున్
|
|
సారపు ధర్మమున్ విమలసత్యముఁ
బాపముచేత బొంకుచేఁ |
|
1. సారపు ధర్మమున్ 2. విమలసత్యముఁ 3. బాపము చేత బొంకుచేఁ 4. బారముఁ బొందలేక 5. చెడఁబాఱినదైన యవస్థ |
6. దక్షు లెవ్వార లుపేక్షచేసి రది 7. వారల చేటగుఁ గాని 8. ధర్మ నిస్తారక మయ్యు 9. సత్య శుభదాయక మయ్యును 10. దైవ ముండెడున్ |
అర్ధాలు: సారపు
= సారమైనటువంటి
= చక్కటి; విమల = తప్పులేని; పాపము చేత =
తప్పు పనుల చేత; బొంకుచే = అబద్ధము
చేత; పారము బొందలేక =ఫలితము పొందలేక;
చెడ బాఱినదైన =చెడిపోయిన; అవస్థ = పరిస్థితి; దక్షులు
= శక్తి ఉన్నవారు; ఎవ్వారలు =
ఎవరైతే; ఉపేక్ష చేసిరి = దానిని పట్టించుకోకుండ; అది వారల చేటగు = అది వారికి చెడు చేస్తుంది; కానీ =
అంతేకానీ; ధర్మ నిస్తారకమయ్యు =ధర్మ
+ నిస్తారకము + అయ్యు = ధర్మాన్ని రక్షించుటకు; సత్య శుభ దాయక మయ్యును =
సత్యాన్ని, మంచిని చేయుటకు; దైవ ముండెడున్ = దైవము + ఉండెడున్
= దేవుడు ఉంటాడు; |
|
సందర్భం – మహాభారతంలోని (తిక్కన
వ్రాసినది) ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లి ధృతరాష్ట్రునితో
చెప్పిన మాటలు. భావం: ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని
పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే
చేటు కలుగుతుంది గాని ధర్మాన్ని రక్షించే, సత్యాన్ని, మంచిని చేయుటకు దైవం ఉన్నది.
|
Comments
Post a Comment