భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 15
ఈ భాగంలో బ్రహ్మ దేవుని గురించిన పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.
మొదటిది. పోతన భాగవత రచన చేయటం మొదలుపెట్టి, దేవతాస్తుతి చేస్తున్నాడు. మొట్టమొదటిది సంకల్పం / భగవంతుని తత్వం / శ్రీకృష్ణుని స్తుతి . రెండవది శివ స్తుతి. మూడవ పద్యం బ్రహ్మ దేవుని స్తుతి.

రెండవది. వ్యాస మహర్షి ఆలోచనలో పడ్డాడు. పండితుల కొరకు వేదాలను విభజించాడు. పామరుల కొరకు వేదసారమైన మహాభారతం రచించాడు. అయినా ఆ మహర్షిలో ఒకరకమైన వెలితి. భగవంతుని గురించిన రచన చేయలేక పోయానే అనే చింత. ఇంతలో నారదుడు వచ్చి వేదవ్యాసుడిని పొగుడుతున్నాడు. అపర బ్రహ్మవి అంటున్నాడు.
ఇవిగో పద్యాలు.
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండు పద్యాలు ఉత్పలమాలలో ఉన్నాయి. త-కార ప్రాసతో ఉన్నాయి. ధాత, విధాత అంటూ కలుపుకోవాలి కదా. మొదటి పద్యంలో “భారతీ హృదయ సౌఖ్యవిధాత” (సరస్వతీ దేవి మనస్సునకు సౌఖ్యము చేకూర్చువాడు) అంటే, రెండవ దానిలో “భారత శ్రుతి విధాత” (మహాభారతం వ్రాసినవాడు). “వేదరాశి నిర్ణేత” అని బ్రహ్మదేవుని అంటే, “వేదపదార్థజాత, బ్రహ్మతత్త్వ నిర్ణేతవు” (వేదముల విజ్ఞానము కలవాడు) అని వ్యాసుడిని అన్నాడు. రెండింటిలోనూ “ధాతకున్/ధాతవు” అన్న సంబోధన ఉన్నది.
రెండవ పద్యంలో నారదుడు, వేదవ్యాసుడిని భాగవత రచనకు ఉపక్రమించడానికి ఉత్సాహ పరచబోతున్నాడు. అందుకే ఎత్తుకోవడమే “ధాతవు” (బ్రహ్మదేవునివి) అంటూ మొదలుపెట్టాడు. మిగిలిన పద్యమంతా పోతన తాను మొదటిలో చేసిన స్తుతిపద్యాన్నే తలపించాడు. చివరిగా “ఎందుకు చింత?” అంటున్నాడు.
ఇటువంటి పద్యమే మరొకటి సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఉన్నది. హిరణ్యకశిపుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినాడు. హిరణ్యకశిపుడు నమస్కరిస్తున్న బ్రహ్మదేవుడిని, పోతన మనకు వర్ణిస్తున్నాడు. మరి, హిరణ్యకశిపుని అహంకారం చూపించాలని కాబోలు, ఈ పద్యం మత్తేభంలో వచ్చింది.
ఇవిగో పద్యాలు.
ఆతతసేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.
ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా?
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండు పద్యాలు ఉత్పలమాలలో ఉన్నాయి. త-కార ప్రాసతో ఉన్నాయి. ధాత, విధాత అంటూ కలుపుకోవాలి కదా. మొదటి పద్యంలో “భారతీ హృదయ సౌఖ్యవిధాత” (సరస్వతీ దేవి మనస్సునకు సౌఖ్యము చేకూర్చువాడు) అంటే, రెండవ దానిలో “భారత శ్రుతి విధాత” (మహాభారతం వ్రాసినవాడు). “వేదరాశి నిర్ణేత” అని బ్రహ్మదేవుని అంటే, “వేదపదార్థజాత, బ్రహ్మతత్త్వ నిర్ణేతవు” (వేదముల విజ్ఞానము కలవాడు) అని వ్యాసుడిని అన్నాడు. రెండింటిలోనూ “ధాతకున్/ధాతవు” అన్న సంబోధన ఉన్నది.
రెండవ పద్యంలో నారదుడు, వేదవ్యాసుడిని భాగవత రచనకు ఉపక్రమించడానికి ఉత్సాహ పరచబోతున్నాడు. అందుకే ఎత్తుకోవడమే “ధాతవు” (బ్రహ్మదేవునివి) అంటూ మొదలుపెట్టాడు. మిగిలిన పద్యమంతా పోతన తాను మొదటిలో చేసిన స్తుతిపద్యాన్నే తలపించాడు. చివరిగా “ఎందుకు చింత?” అంటున్నాడు.
ఇటువంటి పద్యమే మరొకటి సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఉన్నది. హిరణ్యకశిపుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినాడు. హిరణ్యకశిపుడు నమస్కరిస్తున్న బ్రహ్మదేవుడిని, పోతన మనకు వర్ణిస్తున్నాడు. మరి, హిరణ్యకశిపుని అహంకారం చూపించాలని కాబోలు, ఈ పద్యం మత్తేభంలో వచ్చింది.
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ గని వాగ్దేవీ మనోనేతకున్
సవిశేషోత్సవ సంవిధాతకు నమ త్సంత్రాతకున్ స త్తపో
నివహాభీష్ట వరప్రదాతకు జగ న్నిర్మాతకున్ ధాతకున్
వివిధప్రాణి లలాటలేఖన మహావి ద్యానుసంధాతకున్.
Comments
Post a Comment